Author: PAKADI RAMANJANEYULU

కన్నీటి వేళ.. అండగా నిలిచిన ఉప్పల ట్రస్ట్

కల్వకుర్తి 11: కల్వకుర్తి మండలంలోని తర్నికల్ తండా అంగొతి దాని నాయక్ అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయాన్ని గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆదేశాల మేరకు ఆయన కుమారుడు డాక్టర్ ఉప్పల అఖిల్ మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సొమ్ల నాయక్,గుండ్య నాయక్, శ్రీనివాస్ నాయక్,దారమోని గణేష్, రుక్మొద్దిన్,సురేష్ గౌడ్,కృష్ణ,చంద్రయ్య,మాణిక్యం,దేవయ్య,శ్రీనివాసులు, పూరి రమేష్,యువకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

బొల్లంపల్లి పోచమ్మ ఆలయ గోపురం నిర్మాణానికి సర్పంచ్ ప్రసాద్ గౌడ్ విరాళం

కల్వకుర్తి సెప్టెంబర్ 11: వెల్దండ మండలంలోని బొల్లంపల్లి గ్రామంలోని పోచమ్మ ఆలయ నిర్మాణ అభివృద్ధి పనులకు గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ తన వంతు సహకారం అందించారు.ఆలయ నిర్మాణ పనులలో భాగంగా గోపుర నిర్మాణమునకు శుక్రవారం గోపుర నిర్మాణ శిల్పికి రూ.20,000 రూపాయలు విరాళంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వెంకటరెడ్డి,ఉప సర్పంచ్ రామకృష్ణ,నాయకులు కానుగుల పర్వతాలు, రమేష్, యాదయ్య, బ్రహ్మచారి, అలంపల్లి కృష్ణ, శ్రీనివాస్ చారి, మాజీ వార్డు సభ్యులు పర్వతాలు,బూర్గు లింగం యాదవ్,…

కంటి వెలుగులో ప్రజాసేవ – సింగిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 6వ కంటి వైద్య శిబిరం

కడ్తాల్, సెప్టెంబర్ 11: కడ్తాల మండలంలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో 6వ ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్య, వైద్య, ఉపాధి రంగాలలో ఎంతోమందికి సేవ చేసే భాగ్యం దక్కిందని అన్నారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానమని, కంటి వైద్య శిబిరాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు…

ప్రజా ఆరోగ్యమే ప్రథమ లక్ష్యం – సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

కడ్తాల్, సెప్టెంబర్ 11: ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కడ్తాల్ ఎంబీఏ గార్డెన్ లో 6వ మెగా ఉచిత కంటి శిబిరం ప్రారంభమైంది. మొదటి రోజు 600 మందికి పైగా హాజరుకాగా 350 మందికి పరీక్షలు, 180 మందికి అద్దాలు, 30 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు.ఐదు మండలాల్లో 19,200 మందికి పరీక్షలు, 722 మందికి ఆపరేషన్లు, 13,075 మందికి అద్దాలు ఇచ్చామని రాఘవేందర్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 11-16 వరకు పరీక్షలు,…

పోషకాహారమే ఆరోగ్యానికి ఆధారం.. అంగన్వాడి పర్యవేక్షకురాలు సరిత రెడ్డి

వెల్దండ సెప్టెంబర్ 11 : పోషకాహారమే ఆరోగ్యానికి ఆధారమని అంగన్వాడి చెర్కూర్ సెక్టార్ పర్యవేక్షకురాలు సరితా రెడ్డి అన్నారు.9వ పోషణ మాసం (సెప్టెంబర్ 09 నుండి అక్టోబర్ 08 వరకు) కార్యక్రమంలో భాగంగా చెర్కూర్ సెక్టార్ పరిధిలోని బర్కత్‌పల్లి గణ్యభావి తండా,గానుగగట్టు తండా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్వాడీల ద్వారా అందించే పోషకాహారాన్ని ప్రదర్శించి, స్థానికంగా లభించే చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలతో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తయారు చేసే విధానాన్ని…

నిరుద్యోగులకు శుభవార్త – సుంకిరెడ్డి జాబ్ డ్రైవ్ కు భారీ స్పందన.!

కల్వకుర్తి 10: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ డ్రైవ్‌లు కొనసాగుతాయని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.తుక్కుగూడలోని ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలో జరిగిన జాబ్ డ్రైవ్ ఇంటర్వ్యూలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూకు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి 35 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. వెల్దండ నుంచి 11, కల్వకుర్తి నుంచి 7, ఆమనగల్ నుంచి 16, తలకొండపల్లి నుంచి 1 మంది హాజరయ్యారు.ప్రతి ఉద్యోగ…

పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి శ్రేయస్కరం – మున్సిపాలిటీ చైర్మన్ సత్య నాయక్

ఆమనగల్ 10: పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని మున్సిపల్ చైర్మన్ మీ పత్యా నాయక్ పిలుపునిచ్చారు.ఆమనగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణ ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాల వల్ల చెరువుల్లోకి రసాయనాలు కలిసి కాలుష్యం పెరుగుతుందన్నారు.రసాయనాలతో చెరువులోని చిన్న జీవరాశులు చనిపోతాయని, ఆ నీటిని తాగి, ఆ నీటిలో పెరిగిన చేపలు తినడం…

కరెంటు కోతలతో రైతన్న ఆగ్రహం – తాండ్ర గేట్ హైవే బ్లాక్.!

కల్వకుర్తి 10: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామంలో కరెంటు కోతలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. శ్రీశైలం – హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి ధర్నాకు దిగారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను గాలికి వదిలేసిందని ఆరోపించారు.రోజురోజుకు కరెంటు కోతలు విధిస్తూ రైతులను వేధిస్తున్నారని, కరువుతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో…

స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ దన్సింగ్ నాయక్

వెల్దండ సెప్టెంబర్ : వెల్దండ మండలంలోని చెదురుపల్లి గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను సర్పంచ్ ధన్ సింగ్ నాయక్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందేలా చూస్తామని అన్నారు.స్మార్ట్ కార్డుల ద్వారా పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేషన్ సరుకులు అందుతాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మెరుగు సహదేవ్, వార్డు సభ్యులు శివ యాదవ్, తిరుపతి,…

బాల భరోసా – అనాధ పిల్లలకు భరోసా

కల్వకుర్తి 09: రాష్ట్రంలోని అనాథ పిల్లలు, నిరాశ్రయులు మరియు సంరక్షణ అవసరమైన బాలల సమగ్ర రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం బాల భరోసా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.ఈ పథకం ముఖ్య ఉద్దేశం తల్లిదండ్రులు లేని పిల్లలు లేదా కుటుంబ పోషణ కోల్పోయిన బాలలను గుర్తించి వారికి ప్రభుత్వ సంరక్షణ కల్పించడం. అలాగే బాలల హక్కుల ఉల్లంఘన, బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ బారిన పడకుండా వారిని కాపాడటమని పేర్కొన్నారు.*ధ్రువీకరణ పత్రం ప్రాముఖ్యత:*ఈ పత్రం ద్వారా ఒక చిన్నారిని ప్రభుత్వం…