ప్రజా ఆరోగ్యమే ప్రథమ లక్ష్యం – సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

కడ్తాల్, సెప్టెంబర్ 11: ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కడ్తాల్ ఎంబీఏ గార్డెన్ లో 6వ మెగా ఉచిత కంటి శిబిరం ప్రారంభమైంది. మొదటి రోజు 600 మందికి పైగా హాజరుకాగా 350 మందికి పరీక్షలు, 180 మందికి అద్దాలు, 30 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు.ఐదు మండలాల్లో 19,200 మందికి పరీక్షలు, 722 మందికి ఆపరేషన్లు, 13,075 మందికి అద్దాలు ఇచ్చామని రాఘవేందర్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 11-16 వరకు పరీక్షలు, 15-19 వరకు ఆపరేషన్లు ఉంటాయి.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు ఆసిఫ్ అలీ, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, సర్పంచ్ బిక్షపతి, నాయకులు చందోజి, బిక్కు నాయక్, రవీంద్ర రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...