అక్రమంగా 22 పశువులను తరలిస్తున్న వాహనాలు పట్టివేత
- కల్వకుర్తి యాదవ సంఘం అధ్యక్షుడిగా జక్కుల చిన్న జంగయ్య యాదవ్! - November 6, 2026
- కొట్ర తండా కూడలిలో పోలీసుల ముమ్మర వాహన తనిఖీలు - November 6, 2026
- ఎస్సీ సంక్షేమ పథకాల సాధనకు ర్యాలీ.. పోలీసులకు వినతి - November 6, 2026
మిడ్జిల్, సెప్టెంబర్ 22: మిడ్జిల్ మండల కేంద్రం మీదుగా అక్రమంగా తరలిస్తున్న నాలుగు బొలెరో వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున నాలుగు వాహనాల్లో 22 పాడి ఆవులు, ఎద్దులు, కోడెలను తరలిస్తుండగా కల్వకుర్తికి చెందిన కౌన్సిలర్ వంశీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో 167వ జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా సమీపంలో పోలీసులు వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.
