Author: Naresh Mashetti

లడ్డు, కలశం దాతలకు ఘన సత్కారం

జనగామ లోని జిఎంఆర్ కాలనీలోని వినాయక మండపంలో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వినాయక స్వామివారి లడ్డు, కలశాన్ని సమర్పించిన దాతలను ఆలయ పూజారి శ్రీనివాస అయ్యగారు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దాతలకు అభినందనలు తెలిపారు.వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు భక్తులు, దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని శ్రీనివాస అయ్యగారు పేర్కొన్నారు. కాలనీవాసులు, భక్తులు కార్యక్రమంలో పాల్గొని దాతలను అభినందించారు.

గణేశుని ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి – మహా అన్నదానం నిర్వహించిన కోళ్ల సాయికుమార్ గౌడ్

రఘునాథపల్లి లో గణేశుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో,సుభిక్షంగా ఉండాలని, రైతులకు మంచి పంటలు పండి మేలు జరగాలని మాజీ ఎంపీపీ మేకల వరలక్ష్మి నరేందర్ ఆకాంక్షించారు.రఘునాథపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ సమీపంలోని బ్యాంక్ స్ట్రీట్ వద్ద బుధవారం యువ నాయకుడు కోళ్ల సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గణేశునికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించిన అనంతరం భక్తులకు మహా అన్నదానం చేశారు.ఈ సందర్భంగా మేకల వరలక్ష్మి నరేందర్ మాట్లాడుతూ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో…

జిఎంఆర్ కాలనీ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలి

ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు పూజా కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతరం కట్కూరు భజన మండలి వారిచే భక్తి భజన కార్యక్రమం నిర్వహించబడుతుంది.ఈ భక్తి కార్యక్రమంలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని, స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.

పాఠశాల లైబ్రరీకి రూ.20 వేల విలువైన పుస్తకాలు అందజేత

పాఠశాల లైబ్రరీకి రూ.20 వేల విలువైన పుస్తకాలు అందజేతజ్ఞాన తెలంగాణ జనగామ ప్రతినిధి, సెప్టెంబర్ 18జనగామలోని మన జెడ్పీహెచ్‌ఎస్ ధర్మకంచె పాఠశాలలో 1982–83 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థి రమేష్ కుమార్ బజాజ్ పాఠశాల లైబ్రరీకి రూ.20 వేల విలువైన పుస్తకాలను అందజేశారు. అలాగే పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు టాప్ ర్యాంకర్లకు నగదు పారితోషికాలను అందజేశారు.ఈ సందర్భంగా జనగామ ప్రభుత్వ జూనియర్ కళాశాలల సీడీసీ చైర్మన్ గట్టు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పూర్వ విద్యార్థి…