సీఎం సభకు రాచూర్ నుంచి భారీగా తరలిన గ్రామస్థులు
- సీఎం సభకు రాచూర్ నుంచి భారీగా తరలిన గ్రామస్థులు - November 26, 2026
- అచ్చంపేటలో భూమిపూజకు వెల్దండ నుంచి భారీగా బయలుదేరిన గిరిజన శ్రేణులు - November 26, 2026
- ఆడబిడ్డ వివాహానికి సర్పంచ్ రూ.10 వేల ఆర్థిక సహాయం - November 25, 2026
సర్పంచ్ గున్నేళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళలు, గ్రామస్థుల ప్రయాణం

వెల్దండ, నవంబర్ 26: అచ్చంపేటలో బుధవారం నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు వెల్దండ మండలం రాచూర్ గ్రామం నుంచి మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. గ్రామ సర్పంచ్ గున్నేళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి గ్రామస్థులు సభకు బయలుదేరారు.ఈ సందర్భంగా సర్పంచ్ గున్నేళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు సాగుతోందన్నారు. ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ కీలక నిర్ణయమని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా ముఖ్యమంత్రి సభకు గ్రామస్థులు ఉత్సాహంగా తరలివెళ్లినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, యువకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
