పోతేపల్లిలో ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించిన..సర్పంచ్ కొండల్ యాదవ్.

1001380733.jpg

వెల్దండ,నవంబర్ 20: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (IKJBP)ను పోతేపల్లి గ్రామంలో సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని, లబ్ధిదారులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.59 సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారు అర్హులని, రేషన్ కార్డు లేనివారు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం అర్హులేనని పేర్కొన్నారు. నమోదు కోసం బీమా చేయించుకునే వ్యక్తి స్వయంగా గ్రామ పంచాయతీ కార్యాలయానికి హాజరై ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు (ఉన్నవారు) సమర్పించాలని సూచించారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సర్పంచ్ కోరారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మోతిలాల్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, యువ నాయకులు శారదా బాలయ్య గౌడ్, వావిళ్ల యాదగిరి, ముంత మల్లేష్ యాదవ్, మార్కండేయుడు, బాలు యాదవ్, ఎండీ అల్లాజి, శ్రీనివాసులు, శ్రీశైలం, సాయి యాదవ్, సాయి డాన్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...