దేశ ప్రగతిలో ఇందిరమ్మది చెరగని ముద్ర – హరి కిషన్ నాయక్
- వ్యవసాయ బోర్ల కేబుల్ వైర్ల చోరీ.. ముగ్గురు నిందితుల అరెస్ట్.! - November 19, 2026
- ఎరవెల్లి ప్రజల పాదయాత్రకు చీమర్ల అర్జున్ రెడ్డి సంపూర్ణ మద్దతు.! - November 19, 2026
- జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు.. పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి - November 19, 2026
.దేశానికి ఇందిరమ్మ చేసిన సేవలు చిరస్మరణీయం
.దేశ ప్రగతిలో ఇందిరమ్మది చెరగని ముద్ర – హరి కిషన్ నాయక్
వెల్దండ,నవంబర్ 19: మండల కేంద్రంలో దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ దేశాభివృద్ధి, పేదల సంక్షేమం కోసం ఇందిరా గాంధీ చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. సింగిల్ విండో చైర్మన్ యెన్నం భూపతి రెడ్డి మాట్లాడుతూ బ్యాంకుల జాతీయకరణ, హరిత విప్లవం వంటి నిర్ణయాలతో దేశ ప్రగతికి ఆమె విశేష కృషి చేశారని, ఆమె ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హరికిషన్ నాయక్, సర్పంచులు సంగీత శేఖర్ రెడ్డి, గన్యా నాయక్, ఉప సర్పంచ్ బస్నమోని శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ కొయ్యల పుల్లయ్య, సీనియర్ నాయకులు క్యాసరపు వెంకటయ్య, కృష్ణ ముదిరాజ్, ఎండీ రషీద్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎండీ హమీద్, తిరుపతి రెడ్డి, రంగనాథం, భరత్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, కిష్టల్, వెంకటేష్, శ్రీనివాస్, కొండయ్య,టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లయ్య, తిరుపతి, గజిని శ్రీను, ఈదులపల్లి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, కూన వెంకటయ్య,కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
