తలకొండపల్లి ఎక్స్‌రోడ్‌లో గంజాయి పట్టివేత.. ముగ్గురు యువకులు అరెస్ట్!
- సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం: పత్యా నాయక్ - November 17, 2026
- రైతులకు శుభవార్త మూడు గ్రామాలకు కొత్త పీఏసీఎస్‌లు.. ప్రభుత్వ అనుమతి! - November 17, 2026
- ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై కలెక్టర్ ఫోకస్..పంజుగుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ.! - November 17, 2026

తలకొండపల్లి, నవంబర్ 17: తలకొండపల్లి మండలంలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం నమ్మదగిన సమాచారం మేరకు తలకొండపల్లి ఎక్స్‌రోడ్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టి బైక్‌పై గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ వి. జానకిరామ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్ఐ కె. శేఖర్,పోలీసు సిబ్బంది తనిఖీ చేయగా వారి వద్ద 137 గ్రాముల గంజాయి లభించింది. నిందితులను కొంగర తాండకు చెందిన కొల రాహుల్, దేవరీ శివ,గుమ్మడివెల్లి గ్రామానికి చెందిన సభావత్ సాయికుమార్‌గా గుర్తించారు.వారి నుంచి 137 గ్రాముల గంజాయి, ఒక బైక్, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
