లింగారెడ్డి పల్లిలో మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించిన సర్పంచ్ అన్వర్ పాషా

1001409427.jpg

లింగారెడ్డి పల్లి : గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నాణ్యతను స్వయంగా పరిశీలించేందుకు సర్పంచ్ మహ్మద్ అన్వర్ పాషా గారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.గురువారం మధ్యాహ్నం పాఠశాలకు చేరుకున్న సర్పంచ్ గారు, ముందుగా వంటశాలను పరిశీలించి, వంటకు ఉపయోగించే బియ్యం, కూరగాయలు, నూనె తదితర సరుకుల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని వారితో పాటే భోజనం చేసి, భోజనం రుచి, నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.భోజనం నాణ్యతగా ఉందని, విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో వేడి వేడి భోజనం అందించాలని సర్పంచ్ గారు నిర్వాహకులకు సూచించారు. పిల్లల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని, ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

You may also like...