దక్షిణ కాశీకి వెలుగులు..! సొంత నిధులతో లైట్లు ఇచ్చిన సర్పంచ్ సంగీత శేఖర్ రెడ్డి.!

1001344503.jpg

వెల్దండ, నవంబర్ 09 : నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం గుండాల గ్రామంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి పురాతన ఆలయానికి బండోనిపల్లి గ్రామ సర్పంచ్ ఎనుముల సంగీత శేఖర్ రెడ్డి సోమవారం తన సొంత నిధులతో సుమారు రూ.30 వేల విలువైన ఐమాక్స్ లైట్లను అందజేశారు.కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుట్టుగుండంతో వెలసిన అంబా రామలింగేశ్వర స్వామి ఆలయం దేశంలోని పురాతన శివాలయాల్లో ప్రత్యేకమైందని, ఆలయానికి తమ వంతుగా లైట్లు అందించడం సంతోషంగా ఉందని, ఆలయ అభివృద్ధికి మరింత సహకరిస్తామని తెలిపారు.పూజారులు వేదమంత్రాలతో వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు.

You may also like...