ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న బిజెపి: డిసిసి ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్

వెల్దండ: ఎన్నికల కమిషన్ ముసుగులో ఓట్ల తొలగింపుతో బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, దిశ కమిటీ సభ్యుడు ఎం. మోతీలాల్ నాయక్ ఆరోపించారు. మంగళవారం వెల్దండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.దళిత, ఆదివాసీ, బలహీన, మైనార్టీ వర్గాల ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఓటు హక్కు, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘ఓటు బచావో–దేశ్ బచావో’ కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఎన్నికల కమిషన్‌ను ప్రక్షాళన చేసి, చైర్మన్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పర్వత్ రెడ్డి, చల్లా వెంకట్ రెడ్డి, రామస్వామి యాదవ్, బాక్యా నాయక్, దొబ్బల వెంకటయ్య, తిరుపతి రెడ్డి, చందు నాయక్, రెడ్యా నాయక్, సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.1001240407.jpg

You may also like...