గర్భిణీ మహిళకు రక్తదానం చేసిన బండారి సురేష్

కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన *ఫిర్దోస్ బేగం* అనే గర్భిణీ మహిళకి ఆపరేషన్ నిమిత్తం అత్యవసరంగా *ఏబి పాజిటివ్* రక్తం అవసరం కావడంతో పేషంట్ కుటుంబసభ్యులు *జిల్లా రక్తదాతల సేవా సమితి* నిర్వాహకులను సంప్రదించడంతో ఒక్క ఫోన్ కాల్ తో వెంటనే స్పందించిన భిక్నూర్ మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన *బండారి సురేష్* గారు ఒక ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వెంటనే వచ్చి రక్తం ఇవ్వడం జరిగింది. 
ఈ సందర్భంగా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు *బోనగిరి శివ కుమార్*, *ముదాం శ్రీధర్ పటేల్* లు మాట్లాడుతూ
*రక్తం దానం చేస్తే మళ్లీ రక్తం వస్తుంది కానీ, రక్తం అందక పోయిన ప్రాణం తిరిగి రాదు.మనం చేసే రక్తదానం వలన వెలకట్టలేని విలువైన ప్రాణం రక్షించబడుతుంది*….
 యువత మానవత్వంతో స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదాతలు కావాలని తెలుపడం జరిగింది.
ఈ సందర్బంగా ఒక్క ఫోన్ కాల్ చేయగానే వచ్చి రక్తదానం చేసిన *బండారి సురేష్* కి *జిల్లా రక్తధాతల సేవా సమితి* నిర్వాహకులు *బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్* లు ధన్యవాదాలు తెలిపారు.

Dubbaka Srinivas

My name is DUBBAKA SRINIVAS, Education:(B.A), GRADUATED, I have multiple skills but I'm interested journalism My was facing the more than problems in society but I stand with GENUINE & TRUE peoples and society I will try to Justies, I will show the truth to society.

You may also like...