NGKL: విద్యార్థుల పేర్ల సవరణకు అవకాశం – డీఈఓ రమేష్ కుమార్

నాగర్ కర్నూల్: జిల్లాలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల పేర్ల సవరణకు అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రమేష్ కుమార్ ఆదివారం తెలిపారు.జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల పేర్లలో, వారి తల్లిదండ్రుల పేర్లలో ఉన్న స్పెల్లింగ్ తప్పులను సరిచేసుకునేందుకు అవకాశం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.ఈ మేరకు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల విద్యార్థుల వివరాలను పరిశీలించి, స్పెల్లింగ్ మిస్టేక్ లు ఉంటే వెంటనే సరిచేసి యుడైస్ (UDISE) పోర్టల్ లో నమోదు చేయాలని ఆదేశించారు.ఇప్పుడు సరిచేయకపోతే తర్వాత అవకాశం ఉండదని, కొద్ది రోజులు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని డీఈఓ స్పష్టం చేశారు.1001336208.webp

You may also like...