పండుగల సాయన్న విగ్రహాన్ని తొలగించొద్దు

  • బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి జంగిలి నిరంజన్

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 07:
వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహుజన వీరుడు పండుగల సాయన్న విగ్రహాన్ని తొలగించకుండా యథాస్థానంలోనే కొనసాగించాలని బీఆర్‌ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జంగిలి నిరంజన్ డిమాండ్ చేశారు.శుక్రవారం మండల కేంద్రంలోని నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగల సాయన్న ప్రజల కోసం పోరాడిన ధీరుడిగా,పేదలు మరియు బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తిగా ప్రజల మనసుల్లో చిరస్థాయిలో నిలిచిపోయారని,అలాంటి చారిత్రక వ్యక్తి విగ్రహాన్ని తొలగించడం సరికాదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సి సెల్ మండల అధ్యక్షులు కొమ్ము నాగయ్య, జంగిలి ప్రసాద్, పోలె అంజయ్య,చంద్ర శేఖర్, అంజి మాస్టర్,గోరటి అశోక్, తిరుపతి రెడ్డి, సాయి బాబు,కొమ్ము లక్ష్మయ్య, తదితరులున్నారు.

You may also like...