ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికి గాయాలు

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 12 : కట్టంగూర్‌లోని రాంనగర్‌ వద్ద బుధవారం టీవీఎస్‌ లూనాను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మత్స్యకారులు గాయపడ్డారు. మునుకుంట్ల గ్రామానికి చెందిన మత్స్యకారులు వెంకన్న, వేముల వెంకటయ్య నల్లగొండ నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సూర్యాపేట నుంచి నల్లగొండకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న ఆటోను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో లూనాను ఢీకొట్టింది. ప్రమాదంలో వెంకన్న కాలు విరగగా, వెంకటయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 ఈఎంటీ శ్రీనివాస్‌, పైలట్‌ మహేశ్‌ క్షతగాత్రులను నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

You may also like...