పీఏసీఎస్ డైరెక్టర్లుగా పెంజర్ల బిడ్డలు
- ఎయిడ్స్‌పై అవగాహనకు భారీ ర్యాలీ - August 12, 2026
- కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై హైకోర్టు మధ్యంతర స్టే - August 12, 2026
- మిల్లర్ల బకాయిలు వసూలు చేయాల్సిందే - August 12, 2026

- మామిడి ప్రవీణ్‌రెడ్డి,పాముల శ్రీనివాస్‌కు ఘన సన్మానం
- రైతుల సంక్షేమం,సహకార సంఘం అభివృద్ధికి కృషి చేయాలి
- సర్పంచుల సంఘం కొత్తూరు మండల అధ్యక్షులు పెంజర్ల ఎర్రోళ్ల జగన్
జ్ఞాన తెలంగాణ,కొత్తూరు,షాద్ నగర్ ప్రతినిధి,ఆగస్టు 12:
మేకగూడ సహకార సంఘం (పీఏసీఎస్)కు పెంజర్ల గ్రామం నుంచి డైరెక్టర్లుగా మామిడి ప్రవీణ్‌రెడ్డి, పాముల శ్రీనివాస్ ఎన్నిక కావడం పట్ల గ్రామంలో నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లను పెంజర్ల గ్రామ సర్పంచ్ కొత్తూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు ఎర్రోళ్ల జగన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎర్రోళ్ల జగన్ మాట్లాడుతూ పీఏసీఎస్ డైరెక్టర్లుగా ఎన్నికైన మామిడి ప్రవీణ్‌రెడ్డి,పాముల శ్రీనివాస్ గ్రామానికి మంచి పేరు తీసుకురావడంతో పాటు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు సహకార సంఘాల ద్వారా రైతులకు అందే సేవలు మరింత మెరుగుపడేలా నూతన డైరెక్టర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు రైతుల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు.
పెంజర్లకు దక్కిన ప్రాతినిధ్యం
మేకగూడ పీఏసీఎస్‌లో పెంజర్ల గ్రామానికి చెందిన ఇద్దరు ప్రతినిధులు డైరెక్టర్లుగా ఎన్నిక కావడం గ్రామ ప్రజలకు గర్వకారణమని గ్రామ కమిటీ అధ్యక్షులు దేశాల రమేష్ అన్నారు రైతులు సహకార సంఘం సభ్యుల అవసరాలను పీఏసీఎస్ దృష్టికి తీసుకెళ్లి వారికి అందాల్సిన సహకారం అందేలా కృషి చేయాలని కోరారు నూతన డైరెక్టర్ల ఎన్నికతో గ్రామంలో సహకార రంగంపై మరింత నమ్మకం పెరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు దేశాల రమేష్,గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు షేక్ నిజాముద్దీన్,ఎం. శాంతకుమార్,షేక్ సలీముద్దీన్, ఆకనపల్లి సహదేవ్ తదితరులు పాల్గొన్నారు,
