కట్టంగూర్ సమస్యలపై కలెక్టర్కు సర్పంచ్ శ్యామల వినతి
- రౌండ్-16లోకి దూసుకెళ్లిన సింధు
- September 26, 2026 - రాత్రి అన్నం మానేస్తేనే బరువు తగ్గుతారా? - September 26, 2026
- కాచిగూడలో 14 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి - September 26, 2026

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 12 : కట్టంగూర్ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్ మండల కేంద్రంలోని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సాగర్ వాటర్ లైన్లు సక్రమంగా లేకపోవడంతో నీటి సరఫరా సరిగా జరగడం లేదని, ట్యాంకులు పూర్తిస్థాయిలో నిండడం లేదని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న పైప్లైన్ పనులను పూర్తి చేయాలని కోరారు. అలాగే కట్టంగూర్ పట్టణంలో విద్యుత్ లైన్లు, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల సమస్యతో పాటు లో-వోల్టేజ్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. సమస్యల పరిష్కారానికి ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ, విద్యుత్ శాఖ ఎస్ఈలను ఫోన్లో సంప్రదించి వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమస్యలపై కలెక్టర్ తక్షణమే స్పందించడంతో సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.
