కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం
- “విజయం ఒక్కరోజులో రాదు.. పట్టుదలతో సాగిన ప్రతి అడుగూ విజయానికి పునాది.” - September 22, 2026
- స్వర్ణ సంచలనం..లంకపై భారత్ ఘన విజయం! - September 22, 2026
- రిమ్స్ ఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం - September 22, 2026

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 08
కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి బాణావత్ శంకర్ నాయక్ అన్నారు.శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాల ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అభివృద్ధి చేస్తున్నారని, కల్వకుర్తి అభివృద్ధి కసిరెడ్డికే సాధ్యమని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్లు,200 యూనిట్ల ఉచిత కరెంటు,పెళ్లయిన ఆడపిల్లలకు లక్ష రూపాయల నగదు అందజేస్తున్నదని తెలిపారు.రెండవసారి కసిరెడ్డి నారాయణరెడ్డిని ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చూడాలన్నది తన కళ అని తెలిపారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బిక్షపతి నాయక్, లస్కర్ నాయక్ లు ఉన్నారు.
