Daily Archive: October 9, 2026

నాగర్ కర్నూల్ లో ఈ నెల 14న ఉచిత కంటి వైద్య శిబిరం

నాగర్‌కర్నూల్: జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14న బుధవారం ఉదయం 9 గంటలకు నాగర్‌కర్నూల్‌లోని రాంనగర్ కాలనీ, రామకృష్ణ టాకీస్ రోడ్డులో ఉన్న శోభ ఆప్టికల్స్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు విశ్రాంత నేత్ర వైద్యాధికారి బి. శివారెడ్డి తెలిపారు. శిబిరంలో పరీక్షలు నిర్వహించి, ఆపరేషన్లకు అర్హులైన వారికి ఎనుగొండలోని లయన్ రాంరెడ్డి కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని పేర్కొన్నారు. శిబిరానికి వచ్చేవారు ఆధార్, ఓటరు లేదా రేషన్ కార్డు…

పోతేపల్లి బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యేకు వినతి

గుండాల–పోతేపల్లి బీటీ రోడ్డు నిర్మాణానికి వినతిఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సానుకూల స్పందనవెల్దండ: గుండాల నుంచి పోతేపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణంతో పాటు అల్లం తోట బావి తండాలో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతూ కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు.వినతిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, వెంటనే కాంట్రాక్టర్‌ను పిలిపించి పనులు చేపట్టాలని సూచించినట్లు నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి బాణావత్ శంకర్ నాయక్, అల్లం తోట బావి తండా సర్పంచ్ సరోజ, అరుణ్…

విద్యుత్ కోతలపై చంద్రధన రైతుల నిరసన

తలకొండపల్లి,అక్టోబర్ 9: విద్యుత్ కోతలతో వరి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామ రైతులు సబ్‌స్టేషన్‌ వద్ద మెరుపు ధర్నా నిర్వహించారు. పురుగుమందు బాటిళ్లతో వినూత్నంగా నిరసన తెలిపారు.ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు, విద్యుత్ కోతలు మరింత నష్టం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెల్జాల్ సబ్‌స్టేషన్‌ నుంచి చంద్రధన సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు. 24 గంటల విద్యుత్ సరఫరా…

డొంకి చంద్రమౌళి కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సాయం

వెల్దండ, అక్టోబర్ 9: వెల్దండ మండల పరిధిలోని పోతేపల్లి గ్రామానికి చెందిన డొంకి చంద్రమౌళి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి, పోతేపల్లి సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్ శుక్రవారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం కుటుంబానికి రూ.3,000 ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎగిరిశెట్టి శివ, ఉడుత శివతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలకు గోలి ఆర్థిక సహాయం అందజేత

వెల్దండ, అక్టోబర్ 9: వెల్దండ మండలంలోని పోతేపల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబాలకు అంజి మాస్టర్ అండగా నిలిచారు.తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో మృతుల కుటుంబాలకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు.పోతేపల్లి గ్రామానికి చెందిన డెంకి చంద్రమౌళి, లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మల్లెపాకుల ప్రశాంత్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న అంజి మాస్టర్,…

బాన్సువాడ ఆర్టీసీ డిపోలో యూనియన్ ఎన్నికల సందడి

బాన్సువాడ: బాన్సువాడ ఆర్టీసీ డిపోలో శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి ఉద్యోగ సంఘాల ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. వివిధ కార్మిక సంఘాలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.ఎంప్లాయిస్ యూనియన్, టీఎస్‌డబ్ల్యూయూ, ఐఎన్‌టీయూసీ, ఎస్‌డబ్ల్యూఎఫ్, బీఎంఎస్, టీఎంయూ తదితర యూనియన్లు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఉదయం నుంచే డిపోలో ఎన్నికల సందడి నెలకొనగా, ఉద్యోగులు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి ఓట్లు వేస్తున్నారు.పోలింగ్ ప్రక్రియ శుక్రవారం సాయంత్రం…

బతుకమ్మలతో పాఠశాలల విద్యార్థినులు

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప పండగ బతుకమ్మ .పువ్వులను ఆరాధించడం ఒక విలక్షణ సంస్కృతిగా మన తెలంగాణలో కనిపిస్తుంది మహిళల ఆత్మీయ, ప్రకృతి ప్రేమ, భక్తి, సాంస్కృతిక వైవిధ్యాన్ని బతుకమ్మ చాటుతుంది.పాఠశాలలకు దసరా సెలవులు ఇచ్చే  తరుణంలో విద్యార్థినులు  ఉదయం పాఠశాలకు వెళ్లే సమయంలో అక్కడక్కడ బస్ స్టాప్ లలో, పాఠశాలలకు వెళ్లే దారులలో  బతుకమ్మలతో సంప్రదాయ దుస్తులలో చిన్నారులు రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో  కనిపించారు పాఠశాలలకు చివరి రోజు కావడంవల్ల బతుకమ్మ వేడుకలు జరుపుకోనున్నారు ….

బ్యాతల శివశంకర్ పార్థివదేహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య

రంగారెడ్డి జిల్లా పరిధిలోని టంగుటూరు గ్రామానికి చెందిన యువకుడు బ్యాతల శివశంకర్ గుండెపోటుతో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.యువకుడు శివశంకర్ మరణవార్త తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ...

గుండెపోటుతో MRPS రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బ్యాతల శివశంకర్ మృతి

శంకర్‌పల్లి మండలం టంగుటూరు గ్రామానికి చెందినMRPS రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బ్యాతల శివశంకర్ ఈరోజు ఉదయం 5 గంటలకు గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మరణవార్తతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బ్యాతల శివశంకర్ మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన...