Monthly Archive: September 2026

22-A భూములు, ప్రభుత్వ భూములపై సమగ్ర విచారణ జరపాలి టీపీసీసీ స్పోక్స్‌పర్సన్ నూక కిరణ్ కుమార్ యాదవ్

జనగామ, సెప్టెంబర్ 18: 22-ఏ నిషేధిత భూములు, ప్రభుత్వ, అసైన్డ్ భూములపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని టీపీసీసీ స్పోక్స్‌పర్సన్ నూక కిరణ్ యాదవ్, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యమ సమయంలో భూములు లేని కొందరికి పదేళ్లలో వందల ఎకరాలు ఎలా వచ్చాయో లెక్క తేల్చాలని కోరారు. ధరణి రికార్డుల్లో మార్పులు, భూముల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు, యాజమాన్య బదలాయింపులపై విచారణ…

వెదురుతో ఆర్థిక వనరులకు బాటలు.. అదనపు కలెక్టర్

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 18: వెదురు వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని ఆర్థిక ఆదాయ వనరులను పెంపొందించుకోవాలని నాగర్‌కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య అన్నారు. అంతర్జాతీయ వెదురు దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వెదురుతో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసి ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చన్నారు. వెదురు ఆధారిత పరిశ్రమలు, హస్తకళలను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ…

22-ఏ భూములపై సమగ్ర విచారణ చేపట్టాలి కలెక్టర్ కు వినతి పత్రం

22-ఏ భూములపై సమగ్ర విచారణ చేపట్టాలి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారుతెలంగాణ పిసిసి అధికార ప్రతినిధి నూక కిరణ్ కుమార్ యాదవ్ మరియు డిసిసి అధ్యక్షురాలు లకావత్ ధనవంతి లక్ష్మీనారాయణ నాయక్జనగామ, సెప్టెంబర్ 18: జిల్లాలోని 22-ఏ భూములు, ప్రభుత్వ భూములపై సమగ్ర విచారణ చేపట్టాలని టీపీసీసీ అధికార ప్రతినిధి నూక కిరణ్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. భూముల రికార్డులు, రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లను పూర్తిగా పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిగితే బాధ్యులపై చర్యలు…

సీఎం ఆర్ఎస్ఎస్ చెక్కు అందజేసిన.. ఎమ్మెల్యే కసిరెడ్డి

వెల్దండ, సెప్టెంబర్ 18:వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన గోరంట్ల మహేష్‌కు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) రూ.19,500 చెక్కును శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎమ్మెల్యే అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. అనారోగ్యం, ఆపద సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) అండగా నిలుస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా మహేష్‌కు…

ఆపదలో ఆపన్న హస్తం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం – రూ. 20 వేల చెక్కు అందజేసిన సర్పంచ్ కొండల్ యాదవ్

వెల్దండ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి, పోతేపల్లి గ్రామ సర్పంచ్ తగుళ్ల కొండలు యాదవ్ సూచించారు.ఇటీవల నూనె కృష్ణయ్య మృతి చెందడంతో ఆయన కుటుంబానికి ప్రభుత్వం నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ (NFBS) కింద మంజూరు చేసిన రూ.20 వేల ఆర్థిక సాయం చెక్కును మంగళవారం బాధిత కుటుంబ సభ్యులకు సర్పంచ్ కొండలు యాదవ్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..

హమారా ప్రసాద్‌పై జనగామలో నిరసన.. దిష్టిబొమ్మ దహనం.

జనగామ, సెప్టెంబర్ 18: డా. బి.ఆర్. అంబేద్కర్‌పై హమారా ప్రసాద్ చేసినట్లు పేర్కొన్న వ్యాఖ్యలను నిరసిస్తూ జనగామలో కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జనగామ చౌరస్తాలో ర్యాలీ చేపట్టి, హమారా ప్రసాద్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి అనంతరం దహనం చేశారు.ఈ సందర్భంగా సమితి జాతీయ అధ్యక్షులు డా. జేరిపోతుల పరశురామ్ మాట్లాడుతూ, అంబేద్కర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ హమారా ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర…

గాయపడిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్‌కు పరామర్శ

జనగామ, సెప్టెంబర్ 18: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో గాయపడిన బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్‌ను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు గౌరవనీయులు హుస్సేన్ నాయక్ శుక్రవారం ఆయన నివాసంలో పరామర్శించారు. రమేష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మనోధైర్యం కల్పించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్దోజు జగదీష్, మహిళా…

నిమజ్జనాల్లో నిర్లక్ష్యానికి నో ఛాన్స్‌! శంకర్‌పల్లి సీఐ రుద్వీర్‌ కుమార్‌ కఠిన హెచ్చరిక

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: వినాయక నిమజ్జనాల నేపథ్యంలో శంకర్‌పల్లి పోలీసులు అప్రమత్తమయ్యారు. మండపాలు ఏర్పాటు చేసి ఐదు రోజులు పూర్తవడంతో నిమజ్జనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఐ రుద్వీర్‌ కుమార్‌ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అత్యుత్సాహంతో ఊరేగింపులు నిర్వహించడం, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించడం, నిబంధనలకు విరుద్ధంగా డీజేలు, సౌండ్‌ సిస్టమ్‌లు వినియోగించడం వంటి చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. నిమజ్జన ప్రాంతాల్లో ఈత రాని వారు నీటిలోకి దిగకుండా నిర్వాహకులు…

నిమజ్జనాల్లో నిర్లక్ష్యానికి నో ఛాన్స్‌.. శంకర్‌పల్లి సీఐ రుద్వీర్‌ కుమార్‌ హెచ్చరిక!

శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లా లోని ఫ్యూచర్‌ సిటీ పరిధిలోని శంకర్‌పల్లి సీఐ రుద్వీర్‌ కుమార్‌ నిమజ్జన వేడుకలపై కఠిన హెచ్చరికలు జారీ చేసారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసి నేటికి ఐదు రోజులు పూర్తికాగా,పలు మండపాల్లో నిమజ్జన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం ఏడు, తొమ్మిది రోజుల మండపాల నిమజ్జనాలు కూడా వరుసగా జరిగే అవకాశం ఉండటంతో పోలీస్‌ యంత్రాంగం ముందస్తు భద్రతా చర్యలకు సిద్ధమవుతోంది. నిమజ్జన ఊరేగింపుల్లో అత్యుత్సాహం, మద్యం సేవించి వాహనాలు…

గుండాలలో జక్కుల రాములు కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల పరామర్శ

వెల్దండ, సెప్టెంబర్ 18: గుండాల గ్రామ సర్పంచ్ జక్కుల వెంకటయ్య తండ్రి జక్కుల రాములు మృతి చెందడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జక్కుల రాములు పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు భూపతిరెడ్డి, వెల్దండ సర్పంచ్ మట్ట వెంకటయ్య గౌడ్, కంటోన్‌పల్లి సర్పంచ్ లక్ష్మణస్వామి, కాంగ్రెస్ నాయకులు రషీద్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మట్ట భరత్…