స్పెషల్‌ రీ–అడ్మిషన్‌కు అవకాశం

డిగ్రీ విద్యను మధ్యలో నిలిపివేసిన పాత బ్యాచ్‌ల విద్యార్థులకు డా. బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (బీఆర్‌ఏఓయూ) కీలక అవకాశం కల్పించింది. గతంలో డిగ్రీలో అడ్మిషన్‌ పొంది, వివిధ కారణాలతో కోర్సును పూర్తి చేయలేక బ్యాక్‌లాగ్స్‌ మిగిలిపోయిన విద్యార్థులు తమ డిగ్రీని పూర్తిచేసుకునేందుకు ప్రత్యేక రీ–అడ్మిషన్‌ సదుపాయాన్ని వర్సిటీ ప్రకటించింది. 1990 నుంచి 2014 విద్యా సంవత్సరాల మధ్య అడ్మిషన్‌ పొందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని వర్సిటీ విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్‌ డా. వై. వెంకటేశ్వర్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు నిర్దిష్ట రుసుము చెల్లించి వర్సిటీ ప్రధాన కార్యాలయంలోని లెర్నర్‌ సపోర్ట్‌ సర్వీసెస్‌ విభాగాన్ని సంప్రదించి రీ–అడ్మిషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. ఏళ్లుగా బ్యాక్‌లాగ్స్‌తో డిగ్రీ పూర్తి చేయలేకపోయిన విద్యార్థులకు ఇది ముఖ్యమైన అవకాశం కాగా, ఇదే చివరి అవకాశమని, భవిష్యత్తులో ఇలాంటి సడలింపులు ఉండవని వర్సిటీ స్పష్టం చేసింది. మరిన్ని వివరాల కోసం విద్యార్థులు టోల్‌ఫ్రీ నంబర్‌ 18005990101 లేదా 040-23680222, 23680333, 23680444, 23680555 హెల్ప్‌డెస్క్‌ నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.1012839790.png

You may also like...