అంబేద్కర్‌పై విమర్శలు.. రాజ్యాంగంపై దాడే మాల మహానాడు నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు ముడుసు బిక్షపతి
- అంబేద్కర్‌పై విమర్శలు.. రాజ్యాంగంపై దాడే మాల మహానాడు నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు ముడుసు బిక్షపతి - September 17, 2026
- ఛలో ఖమ్మం విజయవంతం చేయాలి : ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గజ్జి రవి - September 15, 2026
- కొలువుదీరిన గణనాథులు ఊరువాడా ఏకదంతుడి నామస్మరణం - September 15, 2026
అంబేద్కర్‌పై విమర్శలు.. రాజ్యాంగంపై దాడే
మాల మహానాడు నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు ముడుసు బిక్షపతి
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 16 : ప్రపంచ దేశాలు జ్ఞానానికి ప్రతీకగా గౌరవించే డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కించపరిచేలా పుస్తకాలు వెలువరించడం సరికాదని మాల మహానాడు నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు ముడుసు బిక్షపతి అన్నారు. బుధవారం కట్టంగూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌పై జరుగుతున్న దాడిని యావత్ భారతదేశంపై, భారత రాజ్యాంగంపై జరుగుతున్న దాడిగా పరిగణించాలని ఆయన డిమాండ్ చేశారు. వివిధ రంగాల్లో ఉన్నత విద్యను అభ్యసించి, అనేక డిగ్రీలు సాధించిన అంబేద్కర్ ప్రపంచంలోని పలు దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని బిక్షపతి పేర్కొన్నారు. అంటరానితనం నిర్మూలన కోసం మహద్ సత్యాగ్రహం నిర్వహించడంతో పాటు అణగారిన వర్గాల హక్కుల కోసం రౌండ్‌టేబుల్ సమావేశాల్లో పోరాడారని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అంబేద్కర్ చేసిన కృషిని విస్మరించడం చరిత్రను వక్రీకరించడమేనన్నారు. అంబేద్కర్ మత మార్పిడి నిర్ణయం సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయన వెంట నడిచిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఆయనను కల్పిత నాయకుడిగా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కబర్దార్ హమారా ప్రసాద్ అంటూ ఆయన హెచ్చరించారు. ఎవరో వెనుకుండి నడిపించే విధంగా అంబేద్కర్‌ను అవమానించే ప్రయత్నాలు చేయడం తగదన్నారు. ఇటీవల గడ్డం ప్రసాద్‌పై జరిగిన చర్యను మొత్తం దళిత సమాజంపై జరిగిన చర్యగా అభివర్ణించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు అంబేద్కర్‌పై జరుగుతున్న విమర్శలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు అంబేద్కర్‌పై జరుగుతున్న దాడిని గుర్తించి స్పందించాలని కోరారు. అంబేద్కర్‌ను కించపరిచే అంశాలతో ఉన్న పుస్తక ఆవిష్కరణను అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆ పుస్తకం వెనుక రాష్ట్ర ప్రభుత్వ హస్తం ఉందనే అనుమానాలు ప్రజల్లో కలుగుతాయని హెచ్చరించారు.
