ఫేతేపూర్ ఫ్లైఓవర్‌పై భద్రత ఎక్కడ..?


  • అధికారుల నిర్లక్ష్యానికి నిన్నటి ఘటన అద్దం పడుతోందా..?

శంకర్‌పల్లి మండలం ఫతేపూర్ మూసీ ఫ్లైఓవర్‌పై నిన్న రాత్రి ఓ యువకుడు ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. అదృష్టవశాత్తు నీటిలో పడటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అదే యువకుడు నీటిలో కాకుండా నేలపై పడివుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడమే భయానకం.

వినాయక నిమజ్జనాల నేపథ్యంలో ప్రజల భద్రత కోసం మునిసిపల్ అధికారులు, పోలీస్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది.

ఫ్లైఓవర్‌పై రక్షణ చర్యలు, బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు, నిమజ్జన ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు ఎంతవరకు ఉన్నాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఒకవేళ యువకుడు నీటిలో కాకుండా కింద ఉన్న కఠిన ప్రదేశంలో పడితే బాధ్యత ఎవరిది..?
ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడిన తర్వాతే అధికారులు మేల్కొంటారా..?

నిమజ్జన ఏర్పాట్లపై అధికారులు ముందస్తు భద్రతా చర్యలు తీసుకున్నారా..? లేక కేవలం ఏర్పాట్లు చేసినట్లు చూపించడానికే పరిమితమయ్యారా..? అన్న ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.

అదృష్టవశాత్తు ఓ ప్రాణం నిలిచింది. మరోసారి ఇలాంటి ఘటన జరగకముందే సంబంధిత అధికారులు భద్రతా ఏర్పాట్లను సమీక్షించాల్సిన అవసరం ఉంది.

You may also like...