పోతేపల్లి సబ్ స్టేషన్ పనులను పరిశీలించిన కిరణ్ కుమార్ యాదవ్

1001183738.jpg

వెల్దండ సెప్టెంబర్ 16: వెల్దండ మండలం పోతేపల్లి గ్రామంలో జరుగుతున్న సబ్ స్టేషన్ నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ మండల యువ నాయకులు వావిళ్ళ కిరణ్ కుమార్ యాదవ్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో, కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వావిళ్ళ ఉమా మనీలా సంజీవ్ కుమార్ యాదవ్ ల ప్రత్యేక చొరవతో పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు.అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.ఈ సబ్ స్టేషన్ ప్రారంభమైతే పోతేపల్లి పరిసర ప్రాంత రైతులకు, ప్రజలకు నిరంతర నాణ్యమైన విద్యుత్ అందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

You may also like...