లింగారెడ్డి పల్లిలో విబి-జి రామ్ జి ప్రత్యేక గ్రామసభ
- ఆర్థిక సహాయం చేసిన సర్పంచ్:- - September 16, 2026
- లింగారెడ్డి పల్లిలో విబి-జి రామ్ జి ప్రత్యేక గ్రామసభ - September 15, 2026
- పోతేపల్లిలో పెన్షన్ల పై స్పెషల్ ఆఫీసర్ తనిఖీ:- - September 15, 2026
వెల్దండ : వెల్దండ మండలం లింగారెడ్డి పల్లి గ్రామంలో సర్పంచ్ మహ్మద్ అన్వర్ ఫాషా గారి అధ్యక్షతన విబి జి రామ్ జి ప్రత్యేక గ్రామసభ నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్ నినో ప్రభావం వల్ల నీటినీ కాపాడుకోవాలని పోదుపుగా వాడుకోవాలని ప్రజలకు తేలియజేయడం జరిగింది…. గ్రౌండ్ వాటర్ ను కాపాడుకోవాలని ఉద్దేశ్యంతో పంటపోలలో ఫార్మ్ పాండ్స్ నిర్మించుకోవాలని, ఇండ్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మాణం చేసుకోవాలని తేలియజేశారు.అదే విధంగా పొలాల్లో పామాయిల్ సాగు చేసుకోవాలి అనుకునేవారికి సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇస్తుందని తేలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహ్మద్ అన్వర్ గారు,ఉప సర్పంచ్ జోగు రాములమ్మ లింగమయ్య గారు,వార్డు సభ్యులు,విడి జి రామ్ జి అధికారులు కృష్ణవేణి గారు, గ్రామ మేట్ మల్లేపాకుల భాస్కర్, నేతలు మల్లేపాకుల శేఖర్, మహ్మద్ రహీం గారు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
