చౌడర్‌గూడలో TOSS ప్రవేశాల ప్రచారం
- చౌడర్‌గూడలో TOSS ప్రవేశాల ప్రచారం - September 19, 2026
- హెచ్-1బీపై 1 లక్ష డాలర్ల ఫీజు కొనసాగింపు - September 19, 2026
- ఎర్రగుట్టలో విషాదం.. గుంతలో పడి ఐదేళ్ల బాలుడు మృతి - September 19, 2026

చౌడర్‌గూడ, సెప్టెంబర్ 19: చదువును మధ్యలో నిలిపివేసిన విద్యార్థులు, ఉద్యోగులు, విద్యను తిరిగి కొనసాగించాలనుకునే వారికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ద్వారా మంచి అవకాశం లభిస్తోందని అధికారులు తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. చౌడర్‌గూడ జెడ్‌పీహెచ్‌ఎస్‌లో TOSS ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్‌ను GHM కే. సునీత ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం నీలా మోహన్ నాయక్, ఇన్‌స్ట్రక్టర్ కుశాల్ జామాతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల యాజమాన్యం కోరింది.
