ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ వర్ధంతి వేడుకలు
- కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ నిరసన - September 2, 2026
- ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి, సీఈఓ సుదర్శన్‌రెడ్డి - September 2, 2026
- ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ వర్ధంతి వేడుకలు - September 2, 2026

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 17 వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని వెల్దండ మండల పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు హరికిషన్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.వైయస్సార్ చిత్రపటానికి పూలమాలను వేసి, వైయస్సార్ అమర్ రహే అంటూ నినాదాలతో మారుమోగింది.ఈ సందర్భంగా హరికిషన్ నాయక్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా ఆయన అందించిన పాలన,అమలు చేసిన సంక్షేమ పథకాలు కాలు నేటికీ ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోయావని కొనియాడారు.రైతు సంక్షేమానికి పెద్ద పీఠ,ఆరోగ్య రంగాల్లో కొత్త ఒరవడితో పేదలకు మెరుగైన వైద్యం,స్కాలర్షిప్ లతో పేద విద్యార్థులకు విద్యలో ప్రాధాన్యత, పేదల కోసం గృహ నిర్మాణాలు, ప్రజలతో మమేకమైన నాయకత్వం, ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు యెన్నం భూపతిరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్, కిసాన్ సర్ అధ్యక్షుడు పర్వత్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ ముదిరాజ్,టౌన్ ప్రెసిడెంట్ బాదేపల్లి మల్లయ్య, కృష్ణ ముదిరాజ్, నాయకులు తిరుపతిరెడ్డి, పుల్లయ్య,రషీద్,హామీద్, పంతు నాయక్,కడారి శ్రీనివాస్ యాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మట్ట భరత్ గౌడ్,ఈదులపల్లి శ్రీనివాసులు చరణ్ తదితరులు పాల్గొన్నారు.
