రోడ్డు భద్రతపై, మాదకద్రవ్యాల ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

ఘట్‌కేసర్: విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని ఘట్‌కేసర్ పోలీసులు పిలుపునిచ్చారు. ఘట్‌కేసర్‌లోని రిషి పాఠశాలలో రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. అపరిచితులు ఇచ్చే తినుబండారాలను స్వీకరించవద్దని, అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, వాటి నిర్మూలనకు కృషి చేస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ రహిత…