పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలి,కౌన్సిలర్ మీర్ సమీనా తాహేర్అలీ
పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో గల బీసీ కాలనీ, ఖాన్ కాలనీలలో శుక్రవారం పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కౌన్సిలర్ మీర్ సమీనా తాహేర్ అలీ పరిశీలించారు.ఈ సందర్భంగా కాలనీలలో పేరుకుపోయిన చెత్తాచెదారం,ఇతర పారిశుద్ధ్య సమస్యలను మున్సిపల్ సిబ్బంది సహకారంతో పరిష్కరించారు.అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ.పరిసరాలను ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చెత్తను రోడ్లపై, మురుగునీటి కాలువల్లో వేయకుండా మున్సిపల్ చెత్త సేకరణ వాహనాలకే అందించాలని కోరారు. పట్టణ పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, మున్సిపల్…
