రాజ్యాంగ విలువల ఆచరణకు 21 ఫూలే దంపతుల ప్రతిజ్ఞ
- చేవెళ్ల బీసీ హాస్టల్లో అన్నంలో పురుగులు - August 7, 2026
- రేపు స్వదేశానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య.. ఘన స్వాగతానికి పిలుపు - August 7, 2026
- రేపు స్వదేశానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య - August 7, 2026

- యక్షి ఆధ్వర్యంలో ‘ఫూలే కపుల్స్ ఫెలోషిప్’ ప్రారంభం
జ్ఞాన తెలంగాణా / హత్నూర :
భారత రాజ్యాంగం ప్రతిపాదించిన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సహోదర భావం, ప్రజాస్వామ్య విలువలను గ్రామీణ ప్రాంతాల్లో ఆచరణలోకి తీసుకురావడమే లక్ష్యంగా యక్షి సంస్థ ఆధ్వర్యంలో “రాజ్యాంగ విలువల ఆచరణ – ఫూలే కపుల్స్ ఫెలోషిప్” ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హత్నూర మండలం లోని బడంపేట్ కూడలి లో ఘనంగా నిర్వహించబడింది. ఈ విశిష్ట కార్యక్రమానికి అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సహకారం అందించింది.
ఈ ఫెలోషిప్‌లో మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 21 మంది జంటలు (ఫూలే దంపతులు) భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా రాజ్యాంగ విలువలను తమ వ్యక్తిగత జీవితం, కుటుంబం మరియు గ్రామ సమాజంలో ఆచరిస్తూ, వాటి పరిరక్షణకు, ప్రచారానికి నిరంతరం కృషి చేస్తామని దంపతులు సంకల్పించారు. కుల, మత, లింగ వివక్షతలను పటాపంచలు చేస్తూ సమాజంలో సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు.
ఫెలోషిప్ ద్వారా దంపతులు గ్రామాల్లోని పిల్లలు, యువత, మహిళలతో రాజ్యాంగ సూత్రాలపై ప్రత్యక్ష చర్చలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తామని
మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలేల ఆశయాల స్ఫూర్తితో సమానత్వ సమాజాన్ని నిర్మించడమే ఈ కార్యక్రమ ప్రధాన ధ్యేయంఅని
గ్రామీణ స్థాయిలోనే రాజ్యాంగం అందించిన హక్కులు, బాధ్యతలపై సమాజంలో చైతన్యాన్ని తీసుకురావడమే లక్ష్యం అని యక్షి సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో యక్షి సంస్థ ప్రతినిధులు మధు, సాగరి, అనిల్, గౌస్, ప్రశాంత్, రేణుక, విక్కీ, సత్యశోధక సంఘం ప్రతినిధి శివాజీలతో పాటు ఫెలోషిప్ సమన్వయకర్తలు, మెదక్ మరియు సంగారెడ్డి జిల్లాల నుండి వచ్చిన 21 మంది ఫూలే దంపతులు పాల్గొన్నారు.
