అశ్వారావుపేటలో అట్టహాసంగా మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు

జ్ఞాన తెలంగాణ భద్రాద్రి/అశ్వారావుపేట న్యూస్:బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మెచ్చ. నాగేశ్వరావు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న కార్యకర్తలు. ఈ సందర్భంగా 30 అడుగుల కటౌట్, 47 ఫ్లెక్సీలతో అశ్వారావుపేటను గులాబీమయం చేసి,.మెచ్చా నాగేశ్వరరావుపై అభిమానాన్ని చాటుకున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కాసాని చంద్రమోహన్.అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు మంగళవారం అట్టహాసంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఓల్డ్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాసాని చంద్రమోహన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుపై ఉన్న అభిమానంతో ఆయన సొంత ఖర్చులతో పట్టణ కేంద్రంలో 30 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేయించడంతో పాటు, సెంట్రల్ లైటింగ్ వాల్స్‌పై మొత్తం 47 ప్రత్యేక ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు. ఎటు చూసినా మెచ్చా నాగేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీలు, భారీ కటౌట్ కనిపించడంతో అశ్వారావుపేట పట్టణం గులాబీ రంగులతో కళకళలాడింది. చంద్రమోహన్ చేపట్టిన ఈ ప్రత్యేక ఏర్పాట్లు స్థానికంగా విశేష చర్చనీయాంశంగా మారాయి.అనంతరం ఓల్డ్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై బీఆర్ఎస్ పట్టణ కమిటీ, కాసాని చంద్రమోహన్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు “మెచ్చా నాగేశ్వరరావు నాయకత్వం వర్ధిల్లాలి”, “బీఆర్ఎస్ పార్టీ జయహో” జై కేసిఆర్ అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాసాని చంద్రమోహన్ మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పేద ప్రజల సంక్షేమం కోసం మెచ్చా నాగేశ్వరరావు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి సైనికుడిలా పనిచేసి అశ్వారావుపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండాను మరింత ఎత్తులో ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు జూపల్లి రమణారావు, సున్నం నాగమణి, మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్‌మూర్తి, కాసాని నాగశేష పద్మ, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు భూక్యా ఉదయజ్యోతి, కొల్లు రవి కిరణ్, డాక్టర్ ప్రసాద్ రావు, మాజీ సర్పంచ్ కలపాల దుర్గారావు, మందపాటి మోహన్‌రెడ్డి, శంకా ప్రసాద్, జక్కుల రాంబాబు, జుజ్జురి వెంకన్నబాబు, సంపూర్ణ, జుజ్జురపు శ్రీరామ్‌మూర్తి, మొటూరి మోహన్, జీవన్ రావు, గుడవర్తి వెంకటేశ్వరరావు, నవీన్, ఎండి రహీన్ బేగం, సంకుల స్వరూపతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
