రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన.. ఎమ్మెల్యే కసిరెడ్డి


జ్ఞాన తెలంగాణ,కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 10 :
చౌదర్ పల్లి గ్రామానికి చెందిన శివ రాజా, పద్మమ్మ నాగమణి బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.తక్షణ ఆసుపత్రి ఖర్చులకు గాను ఆర్థిక సహాయం అందించారు.మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.అనంతరం పాముకాటుకు గురై చికిత్స పొందుతున్న దొడ్లపాడు కంబాలపల్లి బుచ్చయ్యను పరామర్శించారు.త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ,వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో ఆమనగల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నరసింహ,వెంకటేశ్వర్లు గౌడ్,డీసీసీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,సురేందర్ రెడ్డి, కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ మనీలా సంజీవ్ కుమార్ యాదవ్,వెల్దండ మండల పార్టీ అధ్యక్షుడు హరికిషన్ నాయక్, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

You may also like...