మానవత్వం చాటుకున్న కల్వకుర్తి మార్కెట్ చైర్మన్
- నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి! - September 25, 2026
- కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కోసం సమరం - September 25, 2026
- ఓటర్లపై నోటీసులు.. మహేశ్ గౌడ్ ఫైర్ - September 25, 2026

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 10 : వెల్దండ మండలం కొట్ర నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న మార్గంలో సోమవారం లారీ మరియు స్కూటీ ఢీకొని ప్రమాదం జరిగింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కల్వకుర్తి మార్కెట్ చైర్మన్ మనీలా సంజీవ్ కుమార్ యాదవ్ ప్రమాదాన్ని గమనించి వెంటనే తన వాహనాన్ని ఆపారు.ప్రమాదంలో గాయపడిన వారిని స్వయంగా కారులో ఎక్కించుకుని, వెంటనే యెన్నమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా సహాయం చేశారు.ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వం.సంజీవ్ కుమార్ యాదవ్ ను మానవతా దృక్పథానికి పలువురు నాయకులు, స్థానిక ప్రజలు అభినందనలు తెలిపారు.
