బండోనిపల్లిలో స్మార్ట్ కార్డులు రేషన్ కార్డుల పంపిణీ – లబ్ధిదారులలో ఆనందం
- కరెంటు కోతలతో రైతన్న ఆగ్రహం – తాండ్ర గేట్ హైవే బ్లాక్.! - September 10, 2026
- స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ దన్సింగ్ నాయక్ - September 10, 2026
- బాల భరోసా – అనాధ పిల్లలకు భరోసా - September 10, 2026
వెల్దండ, సెప్టెంబర్ 09 : వెల్దండ మండలంలోని బండోనిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ ఎనుముల సంగీత – శేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ అల్వాల్ యాదవుల ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్,ఉప సర్పంచులుమాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్మార్ట్ రేషన్ కార్డుల వల్ల అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా రేషన్ అందుతుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామని తెలిపారు. కొత్త స్మార్ట్ కార్డులతో ఇకపై రేషన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తిరుపతమ్మ, నాయకులు కొండల్ రెడ్డి, కృష్ణయ్య, శ్రీను, సురవర్ధన్ రెడ్డి, శ్యామలమ్మ తదితరులు పాల్గొన్నారు.
