కేఎల్‌ఐ కాల్వ పక్కన రక్షణ గోడ కరువు.. ప్రమాదం అంచున రహదారి!

1001374029.jpg

కల్వకుర్తి, నవంబర్ 18: కల్వకుర్తి మండలంలోని తర్నికల్ నుంచి శ్రీరామ్ నగర్‌కు వెళ్లే రహదారి పక్కన ఉన్న కేఎల్‌ఐ కాలువ ప్రమాదకరంగా మారింది. కాలువ నిండుగా నీరు ప్రవహిస్తుండగా, రహదారికి ఆనుకుని ఉన్న కాలువ వైపు ఎలాంటి రక్షణ గోడ లేదా కంచె లేకపోవడంతో వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు.ఈ మార్గంలో నిత్యం పాఠశాల, కళాశాల విద్యార్థులతో పాటు వృద్ధులు రాకపోకలు సాగిస్తుంటారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా కాలువలో పడిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగే వరకు అధికారులు వేచి చూడకుండా ఇరిగేషన్ శాఖ తక్షణమే స్పందించి కాలువ పక్కన రక్షణ గోడ లేదా భద్రతా కంచె ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

You may also like...