ట్రాక్టర్ బోల్తా.. రైతు మృతి!
- చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు! - November 18, 2026
- సీఎస్‌ను కలిసిన ఆర్టీసీ ఎండీ, హైదరాబాద్ సీపీ - November 18, 2026
- ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ.. బాలరాజ్ గౌడ్‌పై రౌడీషీట్! - November 18, 2026

జనగామ బ్యూరో: వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న రైతును ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం విశ్వనాథపూర్ గ్రామంలో ట్రాక్టర్ బోల్తాపడిన ప్రమాదంలో ఓ రైతు దుర్మరణం చెందాడు. రోజంతా పొలంలో వ్యవసాయ పనులు ముగించుకున్న రైతు ట్రాక్టర్‌పై ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో రైతు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. వ్యవసాయ పనులు ముగించుకుని క్షేమంగా ఇంటికి చేరుకుంటాడని ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు ఈ విషాద వార్త తీరని శోకాన్ని మిగిల్చింది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
