మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం.!

1001373927.jpg

వెల్దండ నవంబర్ 18 : వెల్దండ మండల పరిధిలోని గుండాల గ్రామానికి చెందిన పేరుమల్ల శ్రీశైలం మృతి చెందడంతో గ్రామ సర్పంచ్ జక్కుల శిరీష వెంకటయ్య యాదవ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు. ఉప సర్పంచ్ పేరుమల్ల మనీషా సైదులు రూ.2,500 అందించగా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎనుముల గోపాల్ యాదవ్ సైతం తనవంతు ఆర్థిక సహాయం చేశారు.అలాగే బాధిత కుటుంబానికి వావిళ్ల తిరుపతయ్య, కొమ్ము లింగం, పేరుమల్ల కృష్ణ, పేరుమల్ల శ్రీను, హనుమంతు నాయక్, సురేష్ నాయక్ అండగా నిలిచారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

You may also like...