నూతన పాలకవర్గానికి వస్పుల శ్రీశైలం ఘన స్వాగతం.!

1001357934.jpg

ఆమనగల్ నవంబర్ 13 : ఆమనగల్ మార్కెట్ యార్డులో సింగిల్ విండో చైర్మన్ గూడూరు శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ కాలే మల్లయ్యలను మార్కెట్ కమిటీ డైరెక్టర్ వస్పుల శ్రీశైలం శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమానికి, సహకార రంగ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సీఈవో పద్మాకర్ రెడ్డి, నరసింహ, వెంకటేష్, దేవేందర్, వినోద్, దేవరశెట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...