పోతేపల్లిలో ఘనంగా యాదవుల సదర్ ఉత్సవాలు.!
- పోతేపల్లిలో ఘనంగా యాదవుల సదర్ ఉత్సవాలు.! - November 13, 2026
- వింటేజ్ కాఫీ కంపెనీపై ఆరోపణలు అవాస్తవం.! - November 13, 2026
- నూతన పాలకవర్గానికి వస్పుల శ్రీశైలం ఘన స్వాగతం.! - November 13, 2026

వెల్దండ నవంబర్ 13: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామంలో యాదవుల ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు యాదవ సంఘం పెద్దలు, యువకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.బీఆర్ఎస్ మండల నాయకుడు అంజి మాస్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ముందుండి నడిపించగా, గ్రామ సర్పంచ్ కొండల్ యాదవ్ హాజరయ్యారు. గ్రామానికి చెందిన రామస్వామి యాదవ్, ముంత మల్లేష్ యాదవ్, కడారి శ్రీకాంత్ యాదవ్, జగదీష్ యాదవ్, బోయిన మల్లేష్ యాదవ్ తదితరులు కీలకంగా వ్యవహరించి ఉత్సవాల విజయవంతానికి కృషి చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు వావిళ్ల యాదగిరి యాదవ్‌తో పాటు బాలు యాదవ్, ఉడుత శివ యాదవ్, శేఖర్ యాదవ్, వేణు యాదవ్, మల్లేష్ యాదవ్, మహేష్ యాదవ్, లింగం సాయిల్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, ఎం. అల్లాజీ యాదవ్, ఉడుత తిరుపతయ్య యాదవ్, నూనె వంశీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.సదర్ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు సహకరించిన యాదవ సంఘం పెద్దలు, యువకులు, గ్రామ ప్రజలకు అంజి మాస్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
