బాన్సువాడ చోరీల కేసు ఛేదన.. ఇద్దరు అరెస్ట్

బాన్సువాడ: పట్టణంలోని రెండు ఇళ్లలో జరిగిన చోరీ కేసులను పోలీసులు ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పట్టణ సీఐ తుల శ్రీధర్ తెలిపారు. శాంతినగర్ కాలనీ, హరిజనవాడలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు బంగారు, వెండి ఆభరణాలు, నగదును అపహరించారు. దర్యాప్తులో భాగంగా బుధవారం బస్టాండ్ ప్రాంతంలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 29.7 తులాల వెండి, 9.8 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న షాదాబ్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు సీఐ వెల్లడించారు.

You may also like...