జంక్ ఫుడ్‌ నరకాసురుడి వధ!

బాన్సువాడ: పట్టణంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. విద్యార్థులు జంక్ ఫుడ్ పదార్థాలతో నరకాసురుడి ప్రతిమను రూపొందించి, దహనం చేసినట్లుగా కార్యక్రమం నిర్వహించారు. జంక్ ఫుడ్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలను వివరిస్తూ, పౌష్టికాహారం తీసుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. చెడు ఆహారపు అలవాట్లను విడిచిపెట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలనే సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వేద సాహితి, ప్రిన్సిపల్ లావణ్యతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

You may also like...