బుద్ధుని బోధనలపై అవగాహన.. వేలంలో బుద్ధుని ప్రతిమను సొంతం చేసుకున్న..ప్రవీణ్ పోలె

1001288767.jpgతలకొండపల్లి: మండల కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో ఐదు రోజుల ధమ్మా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భగవాన్ బుద్ధుని ప్రతిమను ప్రతిష్ఠించి, బౌద్ధమత ప్రాముఖ్యతను వివరిస్తూ ధమ్మా ప్రచారం చేపట్టారు.ఈ సందర్భంగా బుద్ధుని బోధనల్లో ముఖ్యమైన నాలుగు ఆర్యసత్యాల గురించి వివరించారు. జీవితంలో దుఃఖం ఉందని గుర్తించడం, దుఃఖానికి గల కారణాలను అర్థం చేసుకోవడం, దుఃఖం నుంచి విముక్తి సాధ్యమని తెలుసుకోవడం, విముక్తి కోసం అష్టాంగ మార్గాన్ని అనుసరించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిష్ఠించిన భగవాన్ బుద్ధుని ప్రతిమను వేలం వేయగా ప్రవీణ్ పోలె సొంతం చేసుకున్నారు.ఈ కార్యక్రమాన్ని కాంట్రిబ్యూట్ అవర్ కల్చర్ ఆర్గనైజేషన్ (కో ఖో) ఆధ్వర్యంలో నిర్వహించారు.కమిటీ అధ్యక్షుడు కిరణ్ పోలె, ఉపాధ్యక్షుడు పెరుమాండ్ల నారాయణ,ప్రధాన కార్యదర్శులు పోతుగంటి శివరాజ్,సంతోష్‌తో పాటు కమిటీ సభ్యులు చంద్రశేఖర్, మహేష్,సురేష్,భాస్కర్, యాదయ్య,మహేష్, పాండు తదితరులు పాల్గొన్నారు.

You may also like...