జ్యోతి నగర్ జీఎంఆర్ కాలనీలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు
- జ్యోతి నగర్ జీఎంఆర్ కాలనీలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు - October 11, 2026
- జనగామ జిల్లా ఆవిర్భావానికి పదేళ్లు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం - October 11, 2026
- జనగామ వాసవి కాలనీలో వైభవంగా బతుకమ్మ సంబరాలు పూల పండుగతో పులకించిన మహిళాలోకం - October 11, 2026

జనగామ పట్టణంలోని జ్యోతి నగర్ జీఎంఆర్ కాలనీలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు, యువతులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఐకమత్యంతో జరుపుకున్నారు. భక్తిశ్రద్ధలతో బతుకమ్మకు పూజలు నిర్వహించారు. మహిళల కోలాహలం, బతుకమ్మ పాటలతో జీఎంఆర్ కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. సంప్రదాయాలను కాపాడుకుంటూ మహిళలు ఆనందోత్సాహాల మధ్య వేడుకల్లో పాల్గొన్నారు.
