పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

1000202888.jpg

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పట్టభద్రులు తమ పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. జనగామలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023 నవంబర్‌ వరకు పట్టభద్రులైన వారు ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, పట్టభద్రుల సమస్యలకు గత ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే కేంద్ర నిధులతో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ అధ్యక్షత వహించారు.

You may also like...