గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యమే నా లక్ష్యం.. సర్పంచ్ ప్రసాద్ గౌడ్
- గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యమే నా లక్ష్యం.. సర్పంచ్ ప్రసాద్ గౌడ్ - October 3, 2026
- వెల్దండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు నమోదు - October 2, 2026
- మృతురాలి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక భరోసా.. విషాదంలో ఊతకర్రలా..ఉప్పల - October 2, 2026
వెల్దండ అక్టోబర్ 02: వెల్దండ మండలంలోని బొల్లంపల్లి గ్రామపంచాయతీలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రసాద్ గౌడ్ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం సర్పంచ్ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామాభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.అనంతరం వీబీజీ రాంజీ పనులపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఎల్నినో ప్రభావంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత, ప్రతి పొలానికి ఊట కుంట, బోరుబావులకు రీఛార్జ్ గుంతల ఏర్పాటు తదితర అంశాలపై వివరించారు. వర్షపు నీటిని సంరక్షించుకోవడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకోవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి అన్నపూర్ణ, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
