అమనగల్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డకి ఘన సన్మానం
- అమనగల్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డకి ఘన సన్మానం - November 5, 2026
- వెల్దండ పీఏసీఎస్‌కు కొత్త పాలకవర్గం..చైర్మన్‌గా ఎన్నం భూపతిరెడ్డి నియామకం - November 5, 2026
- కల్వకుర్తిలో గులాబీ జెండాకు సారథి ఎవరు?..టికెట్ రేసులో దూసుకుపోతున్న గోలి శ్రీనివాస్ రెడ్డి - November 4, 2026

అమనగల్ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సింగిల్ విండో చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీ నాయకుడు గూడూరు శ్రీనివాస్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో కడ్తాల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతుగంటి శంకర్ మరియు పట్టణ అధ్యక్షులు మాలే మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ గూడూరు శ్రీనివాస్ రెడ్డి విద్యార్థి దశ నుంచే రాజకీయాల పట్ల ఆసక్తితో యూత్ కాంగ్రెస్ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ప్రజా జీవితాన్ని ప్రారంభించారని ఆయన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాయికంటి బిక్షపతి, ఉపసర్పంచ్ యాదగిరి రెడ్డి, ఎండోమెంట్ డైరెక్టర్ యాదయ్య, వార్డు సభ్యులు మల్లయ్య,మంకి మహేష్, ముత్తి కృష్ణ, జాంగిర్ బాబా, కర్రోల రమేష్ కృష్ణవేణి, రాజు గౌడ్,జగన్ గౌడ్, మోతిలాల్, శివ నాయకులు గురిగళ్ళ లక్ష్మయ్య, ఎస్సి సెల్ రామకృష్ణ, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి క్యామ రాజేష్ మరియు నాయకులు మంకీ శ్రీను, బుచ్చయ్య, ఎర్రోళ్ల శ్రీకాంత్, భరత్ యాదవ్, సత్యం, సాయిలు, రమేష్, రామకృష్ణ, శ్రీకాంత్, గంజి చంద్రశేఖర్, మహేష్, నరేష్, బాబు, సేవ్య మరియు తదితరులు ఉన్నారు.
