విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా నవీన్ చారి
- విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా నవీన్ చారి - September 27, 2026
- జాఫర్ఘడ్ సబ్ మార్కెట్ యార్డును అభివృద్ధి చేసి రైతుల సమస్యలు పరిష్కరించాలి - September 27, 2026
- డీసీసీ కార్యాలయంలో ఘనంగా సేవాదళ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ - September 27, 2026

తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల అసోసియేషన్ జనగామ జిల్లా నూతన అధ్యక్షుడిగా చెల్లోజు నవీన్ కుమార్ చారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం వీరబ్రహ్మేంద్రస్వామి కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు తుమ్మలూరు సత్యనారాయణ ఆయనకు నియామక పత్రం అందజేశారు. జర్నలిస్టులు ఐక్యతతో ముందుకు సాగి హక్కులను సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు జర్నలిస్టులకు ప్రత్యేక హక్కులు, సంక్షేమ పథకాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా బతోజు రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా దిగోజు సాంబయ్య, కోశాధికారిగా సాతెల్లి రాజు తదితరులు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
