చేయూత కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకోండి


. పోలేపల్లి సర్పంచ్ జంతుక వెంకటయ్య



జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 0
కొత్త చేయూత పింఛన్ల కోసం పోలేపల్లి గ్రామంలోని అనుకులైన వారందరూ వెంటనే దరఖాస్తు చేసుకోవాలని పోలేపల్లి సర్పంచ్ జంతుక వెంకటయ్య కోరారు. ఈ మేరకు సర్పంచ్ శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు గల వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు గ్రామపంచాయతీ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు . అవసరమైన ధ్రువీకరణ పత్రాలను జతచేయాలని తెలిపారు. అర్హులైన వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు ఈనెల ఆగస్టు 15న పెన్షన్లు మంజూరు అవుతాయని చెప్పారు.

You may also like...