శంకర్పల్లి మండలంలో రిజర్వేషన్లు ఖరారయ్యాయి
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

శంకర్పల్లి, నవంబర్ 23: మండలంలోని 24 గ్రామాలకు సంబంధించిన పంచాయతీల రిజర్వేషన్లు అధికారులు ఖరారు చేశారు. ఎస్టీ వర్గానికి చెందిన పంచాయతీలుగా మోకిలా తండా (ఎస్టీ మహిళ), కొండకల్ (ఎస్టీ జనరల్) నిర్ణయించగా, ఎస్సీ రిజర్వేషన్ల కింద సంకేపల్లి (ఎస్సీ జనరల్), రావులపల్లి కలాన్ (ఎస్సీ మహిళ), చెందిప్ప (ఎస్సీ జనరల్), మోకిలా (ఎస్సీ జనరల్), ఎల్వర్తి (ఎస్సీ మహిళ), పొద్దుటూరు (ఎస్సీ జనరల్) పంచాయతీలు ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ల కింద మహారాజ్పేట్ (మహిళ), పర్వేద (జనరల్), అంతప్పగూడ (జనరల్), లక్ష్మి రెడ్డి గూడ (మహిళ) గ్రామాలు నిలిచాయి. జనరల్ వర్గంలో ఎర్వగూడ (మహిళ), శేరింగూడ (మహిళ), దొంతన్పల్లి (జనరల్), కొత్తపల్లి (జనరల్), టంగటూర్ (మహిళ), ఇరుకుంట తండా (మహిళ), గోపులారం (జనరల్), గాజులగూడెం (మహిళ), పిల్లిగుండ్ల (మహిళ), మాసానిగూడ (మహిళ), మహాలింగపురం (జనరల్), అలంకఖాన్గూడ (జనరల్) పంచాయతీలు ఉన్నాయి. మండల వ్యాప్తంగా రిజర్వేషన్లను నిష్పాక్షికతతో ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు.
