Daily Archive: November 16, 2026

పాత్రికేయులకు జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు: సర్పంచ్ ప్రసాద్ గౌడ్

కల్వకుర్తి నవంబర్ 16: జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పాత్రికేయులందరికీ బొల్లంపల్లి సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్థంభంగా పత్రికా రంగం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, ప్రజల గొంతుకగా నిలుస్తున్న పాత్రికేయుల సేవలు అభినందనీయమన్నారు. నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువస్తూ సమాజ అభివృద్ధికి పాత్రికేయులు మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఇందిరమ్మ ఇళ్ల విస్తీర్ణం పెంచాలి.. వాటర్ ప్లాంట్లను తనిఖీ చేయాలి.!

ఆమనగల్ నవంబర్ 16 :ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి శ్లాబ్ విస్తీర్ణ పరిమితిని ప్రస్తుత 750 చదరపు అడుగుల నుంచి 950 చదరపు అడుగులకు పెంచాలని ఎస్సీ, ఎస్టీ (PCR & POA Act) అట్రాసిటీ అండ్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జంతుక శంకర్ కోరారు. సోమవారం ఆమనగల్ మండలంలో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. జీవో ఎంఎస్ నం.22ను సవరించి పేద, బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు ప్రయోజనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.అలాగే…

​పిచేర్యాగడి తండాలో నూతన ‘చేయూత’ పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ ​లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ రాథోడ్ వినోద్ కుమార్

జ్ఞానతెలంగాణఝరాసంగం నవంబర్ 16కోహిర్ మండల పరిధిలోని పిచేర్యాగడి తండాలో అర్హులైన లబ్ధిదారులకు నూతన ‘చేయూత’ పెన్షన్ మంజూరు పత్రాలను తండా సర్పంచ్ రాథోడ్ వినోద్ కుమార్ సోమవారం పంపిణీ చేశారు.​ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నూతన పెన్షన్ల మంజూరుతో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని అన్నారు. గత కొంతకాలంగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న తమకు ప్రభుత్వం చేయూతనివ్వడం ఎంతో…

వైభవంగా మండల మహా కలశ స్థాపన

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 16: మండల కేంద్రంలోని శ్రీ సాయి మణికంఠ దేవాలయంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మండల మహాపూజ కార్యక్రమాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున మహాగణపతి హోమంతో పూజలకు అంకురార్పణ చేశారు. ఆలయ పూజారి కొటారు సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో తాంత్రిక విధానంలో మహాకలశం, అష్టాదశ కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మహాకలశాన్ని అయ్యప్ప గర్భాలయంలో ప్రతిష్ఠించారు. అనంతరం కలశ జలాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అయ్యప్ప స్వాముల భజనలు, భక్తుల…

భూ రీ-సర్వేను రైతులు సద్వినియోగం చేసుకోవాలి జి.విజయేందర్, పరిగి మండల డిప్యూటి తహశీల్ధార్

పరిగి:వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూ రీ-సర్వే ను పకడ్బందీగా నిర్వహించాలని సర్వే సిబ్బందికి తెలియజేయడమైనది. చిగురాల్ పల్లి గ్రామ రెవెన్యూ శివారులో కొనసాగుతున్న భూ రీ – సర్వే పనులను నేడు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించడమైనది.ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో భూ వివాదాలకు తావు లేకుండా భూ రీ- సర్వే ద్వారా ప్రతి రైతుకు సంబంధించిన భూముల హద్దులను ఖచ్చితంగా గుర్తించాలన్నారు.సర్వే జరిగే గ్రామాల్లో రైతులు ముందుగా అందించే సమాచారంతో…

41 రోజుల పాటు అయ్యప్ప స్వాములకు అన్నదానం

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 16: మండల కేంద్రంలోని సుప్రసిద్ధ సాయి మణికంఠ ఆలయంలో అయ్యప్ప దీక్ష స్వాములకు 41 రోజుల పాటు నిత్య అన్నదానం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్, మాజీ ఎంపీపీ జెల్లా ముత్తిలింగయ్య, గురుస్వామి వంగూరి లక్ష్మయ్య తెలిపారు. సోమవారం మండల మహాకలశ స్థాపన అనంతరం అన్నదాన కార్యక్రమానికి మాజీ పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు స్వామి రూ.90 వేల విలువైన 10 క్వింటాళ్ల బియ్యాన్ని విరాళంగా అందించారు. డిసెంబర్ 27 వరకు ప్రతిరోజూ…

నిరుపేదల వైద్యానికి సీఎం సహాయనిధి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన ఆరుగురు లబ్ధిదారులకు రూ.2.86 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కులను బాచుపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు అందజేశారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి చొరవతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో వైద్య చికిత్సల కోసం ఈ ఆర్థిక సాయం మంజూరైంది. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షుడు కొలన్ రాజశేఖర్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి పండరి రావు, లక్ష్మారెడ్డి, రషీద్, ప్రసన్న కుమార్, డప్పు నరేందర్, మహమ్మద్…

బొల్లెపల్లి ఉన్నత పాఠశాలలో మాక్ పోలింగ్

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 16 : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో విలువైందని ప్రతి ఒక్కరూ హక్కు బాధ్యతగా వినియోగించుకోవాలని మండలంలోని బొల్లెపల్లి ఉన్నత పాఠశాలలో సోమవారం మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఓటు కీలక పాత్ర పోషిస్తుందని విద్యార్ధులకు వివరించారు. భవిష్యత్తులో ఓటర్లుగా మారనున్న విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియ. ఓటు హక్కు ప్రాముఖ్యత, ఓటు వేసే విధానం, ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు పాఠశాలలో…

జగద్గిరిగుట్ట హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

జగద్గిరిగుట్టలో 2015లో జరిగిన మెదిది ఆనంద్ కుమార్ (23) హత్య కేసులో నిందితులు నితాయ్ రాకేష్, షేక్ బాబర్ జానీలకు కూకట్‌పల్లి III అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం. వెంకటేశ్వరరావు జీవిత ఖైదు విధించారు. ఒక్కొక్కరికి రూ.5 వేల జరిమానా విధించారు. ఈ కేసులో జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కుశాల్కర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జి.వి.కె. రామకృష్ణ, డి. ఉపేందర్ కీలకంగా వ్యవహరించారు. ఈ వివరాలను సైబరాబాద్ డీసీపీ (క్రైమ్స్) ఆఫీస్ ప్రెస్‌నోట్ ద్వారా…

పరిగిలో రేపు చేయూత పెన్షన్ పత్రాలు, కుట్టు మిషన్ల పంపిణీ .మున్సిపల్ కమిషనర్ మల్లేష్

పరిగిలో రేపు చేయూత పెన్షన్ పత్రాలు, కుట్టు మిషన్ల పంపిణీ కొడంగల్ రోడ్డులో గల కొప్పుల అనంత రెడ్డి గార్డెన్‌లో రేపు మంగళవారం ఉదయం 11 గంటలకు చేయూత పెన్షన్ల మంజూరీ పత్రాలు, మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ టీ. రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ పంపిణీ జరగనుంది. అర్హులైన పెన్షన్ లబ్ధిదారులు, ఎంపికైన మైనారిటీ మహిళలు ఆధార్ కార్డు, సంబంధిత పత్రాలతో సకాలంలో హాజరుకావాలని పరిగి మున్సిపల్…